telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

6 మిలియన్ల క్లబ్‌లోకి కమల్ హాసన్

Kamal-Hassan

లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాతో రికార్డ్ సృష్టించారు. తాజాగా 6 మిలియన్ల క్లబ్‌లోకి ఎంటరయ్యారు. ఇప్పుడు ఏ హీరోకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వారే సోషల్ మీడియాలో టాప్. ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య 6 మిలియన్లకు చేరింది. 2015లో ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన కమల్ హాసన్‌ని ప్రస్తుతం 6 మిలియన్ల మంది ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాలతో పాటు రాజకీయాలలోనూ చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే ఏదో ఒక కాంట్రవర్శీలో కమల్ పేరు రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా త్యాగరాజ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సంగీతకారుల ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే.

Related posts