telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ చేతికి కార్తీ “ఖైదీ” హక్కులు

Khaidi

కార్తి హీరోగా రూపొందుతున్న చిత్రం “ఖైదీ”. లొకేష్ క‌న‌క‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చ‌ర్స్‌, వివేకానంద పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై ఎస్‌.ఆర్‌.ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్ బాబు, తిరుపూర్ వివేక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత, శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ సోమ‌వారం విడుద‌లైన గుడ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. శామ్ సి.ఎస్‌. సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కార్తి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌రైన్‌, దీనా, మ‌రియం జార్జ్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరోగా నిల‌బెట్టిన చిత్రం “ఖైదీ” టైటిల్‌తోనే ఈ చిత్రం కూడా రూపొందుతుండడం విశేషం.

Related posts