ఈజీ మనీ కోసం పోలీసుల అవతారమెత్తి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీలను గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఇద్దరు నకిలీ పోలీసులు తాడేపల్లిలోని షాపులను తమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారు.
షాపుల వద్దకు వెళ్లి మామూళ్లు వసూలు చేయడం మొదలు పెట్టారు. తొలిరోజుల్లో ఎంతోకొంత సమర్పించుకున దుకాణ యజమానులు రోజు రోజుకీ వీరి ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు వాలిద్దరు అసలు పోలీసులే కాదని తెలియడంతో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.