పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించి… “అమరులు వారు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ మీద గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా అని పేర్కొన్నారు. ఇక మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం ప్రతీ పోలీసు సోదరసోదరీమణులు నిరంతరం కృషి చేయాలని జగన్ పేర్కొన్నారు.