telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బెల్ బాటమ్ విడుదల తేదీ వచ్చేసింది…

Bell-Bottom

బాలీవుడ్ అగ్ర హీరోల్లో అక్షయ్ కుమార్ కచ్చితంగా ఉంటాడు. గతేడాది దీపావళికి అక్షయ్ లక్మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను హాట్ స్టార్‌లో రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా నుంచి అనుకున్నంత స్పందన అందలేదు. దాని తరువాత నిర్మాతగా భాగమతి సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే అక్షయ్ ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బెల్ బాటమ్ అని పేరును ఖరారు చేశారు. దీనిని దర్శకుడు రంజిత్ తివారి రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. బెల్ బాటమ్ సినిమాను మే28న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం తెలిపింది. నిజానికి ఈ సినిమా 2020 ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. దాంతో ఈ సినిమా దాదాపు ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Related posts