telugu navyamedia
క్రీడలు వార్తలు

రిటైర్మెంట్‌ పై క్లారిటీ ఇచ్చిన మిథాలి రాజ్‌…

భారత వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆవిడ మాట్లాడుతూ… ’20 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్‌ మొత్తం.. 2020 ఒక్క ఏడాదితో సమానంగా మారింది. ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. అయినా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలి. అదెంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకోసం నేను బాగా కష్టపడాలి. రోజురోజుకూ నా వయసు పెరుగుతోంది. 2022 వన్డే ప్రపంచకప్‌ ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలు ఉన్నాయి. మధ్యలో వెస్టిండీస్‌తో హోమ్‌ సిరీస్‌ కూడా ఉంది. కాబట్టి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం’ అని మిథాలి రాజ్‌ అన్నారు. ‘ఇకపై జరిగే ప్రతి సిరీస్‌ నాకు ఎంతో ముఖ్యం. ప్రపంచకప్‌ ఉండడంతో ఆ పర్యటనలు అన్ని జట్టును బలంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోపడతాయని గట్టిగా నమ్ముతున్నా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉన్న అవకాశాలతోనే నా సహచర క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. వారిని అలా చూడటం సంతోషంగా ఉంది. మా ఫాస్ట్‌ బౌలింగ్‌ యూనిట్‌పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సీనియర్‌ ప్లేయర్‌ జూలన్‌ గోస్వామి కెరీర్‌ ముగింపు దశకు చేరుకున్నారు. ఇతర బౌలర్లను ప్రపంచకప్‌కు సన్నద్ధం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Related posts