పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ విరుచుకుపడ్డారు.లిలువాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రాష్ట్రాన్ని కశ్మీర్‌లా మారుస్తున్నారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ఆమె ఓటు బ్యాంక్ కోసం లేనిపోనీ హామీలిస్తున్నారన్నారు. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారం కోల్పోతే ఆమె ఆత్మహత్య కూడా చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మమత తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇచ్చి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని అర్జున్ సింగ్ ఆరోపించారు. విదేశీయుల కారణంగా బంగ్లాదేశ్ మరో కశ్మీర్‌లా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 107 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. మమతకు దమ్ముంటే తన నిజయోజకవర్గమైన భాట్‌పర నుంచి పోటీ చేయలాలని అర్జున్ సింగ్ సవాలు విసిరారు.
మైనార్టీల హక్కులు పూర్తిగా అణచివేస్తున్నారు: రఘువీరా