రాస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజుకు 3 లక్షలను పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ మహమ్మారిపై పోరాటం చేసేందుకు దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి దశల వారీగా కరోనా వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చినా చాలా మంది వాటిని తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. వ్యాక్సిన్ ఫై అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు అధికారులు ముందుకు వచ్చారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలోని గ్రామాల్లో అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్, ఆసరా పింఛన్లు ఇస్తామని తెలిపారు. అయితే మరి ఈ ఆలోచన పని చేస్తుందా… లేదా అనేది చూడాలి.
previous post