telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

దేశంలో ఆర్థికమాంద్యం.. పరిశ్రమలలో శాలరీలు ఆలస్యం … రుణాల బెడద ..

late salaries lead to unpaid loans

దేశంలో ఆర్థికమాంద్యం కోరలు విప్పుకుంటుంది. దీనితో చాలా పరిశ్రమలలో శాలరీలు ఆలస్యం వల్ల చాలామంది ఉద్యోగులు లేదా వ్యక్తులు తమ రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. అదే విధంగా మందగమనం కారణంగా వ్యాపారాల్లో నష్టం వస్తుండటంతో వ్యాపారులు కూడా కట్టలేకపోతున్నారని కూడా పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో 30 రాష్ట్రాల్లో 40 రుణ సంస్థలు ఇచ్చిన 2 లక్షల రిటైల్ రుణ ఖాతాలను పరిశీలించింది. ఇందులో చాలా వరకు NBFCలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగమనం మన దేశంలో కూడా రుణ వసూళ్లపై ప్రభావం చూపుతోందని ఈ నివేదిక పేర్కొంది. అలాగే దేశంలో నిరుద్యోగిత నాలుగు దశాబ్దాల కనిష్టానికి, వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో పాటు కార్పోరేట్ రుణాల గిరాకీ తగ్గి రిటైల్ రుణాలకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. మందగమనం, రిటైల్ రుణాలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకుంటే తాజా నివేదిక ప్రకారం ముందు ముందు రుణాల తిరిగి చెల్లింపుపై మరింత ప్రభావం పడే అవకాశముందని చెబుతోంది.

బ్యాంకులు ఎక్కువగా రిటైల్‌ రుణాలపై దృష్టి పెట్టడం, మందగమంతో రిటైల్ రుణాల వసూళ్లు కష్టంగా మారడం ఇబ్బందికరమేనని అంటున్నారు. రిటైల్ రుణాల వసూళ్లను కింది అంశాలు ప్రధానంగా దెబ్బతీస్తున్నట్లు క్రెడిట్‌మేట్ తెలిపింది. రుణాల చెల్లింపుల్లో పురుషుల కంటే మహిళలు నయంగా కనిపిస్తున్నారు. బకాయిల చెల్లింపుల్లో మహిళలు ముందున్నారు. డిఫాల్టర్లలో 82 శాతం పురుషులే కావడం గమనార్హం. అంతేకాదు పేరుకుపోయిన రుణ బకాయిలను పురుషులతో పోలిస్తే మహిళలు 11 శాతం వేగంగా చెల్లిస్తున్నారు. రుణాల చెల్లింపులో ఒడిశా, చత్తీస్‌గఢ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ముందున్నాయి. మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, తమిళనాడు రాష్టారులు వెనుకబడి ఉన్నాయి. బెస్ట్ పేమెంట్ రేట్‌లో గోవా కూడా ముందుంది.

– వేతనాల ఆలస్యం వల్ల 36 శాతం
– వ్యాపారాల నష్టం లేదా మూసివేత వల్ల 29 శాతం
– వైద్యపరమైన అత్యవసర ఖర్చుల వల్ల13 శాతం
– ఉద్యోగాలు పోవడం వల్ల 12 శాతం
– ఉపాధి కోసం వలసల వల్ల 10 శాతం ఉన్నట్లుగా పేర్కొంది.

Related posts