telugu navyamedia
క్రీడలు వార్తలు

16 కోట్ల ఫండ్ రైజింగ్ క్యాంపైన్ ను సిక్స్ తో గెలిపించిన విరుష్క…

ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి నుంచి రక్షించేందుకు అతనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్గెన్స్‌మా అనే మెడిసన్ అవసరమైంది. దాని ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఈ డబ్బుల కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు ట్విటర్ వేదికగా ‘AyaanshFightsSMA’పేరుతో ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టారు. అయితే సోమవారంతో తన కుమారుడి మెడిసిన్‌కు కావాల్సిన రూ.16 కోట్లు వచ్చాయని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు విరాళాలు అందించిన వారితో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ధన్యవాదాలు తెలిపారు. ‘మా ఈ #Saveayaanshgupta ఫండ్ రైజింగ్ క్యాంపైన్ ఇంత త్వరగా ముగుస్తుందనుకోలేదు. జోల్గెన్స్‌మా మెడిసిన్‌కు కావాల్సిన రూ.16 కోట్లు వచ్చాయి. అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. మీ అభిమానులుగా మేం ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాం. కానీ మీరు అయాన్ష్ కోసం మేం ఊహించనిదాని కంటే ఎక్కువ చేశారు. మీ ఔదార్యానికి ధన్యవాదాలు. మా జీవితంలోనే ఈ కఠినమైన మ్యాచ్‌ను సిక్స్‌తో గెలవడానికి మీరు సాయం చేశారు. మీ సాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.’అని పేర్కొన్నారు.

Related posts