దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ ఛీప్ లాలు యాదవ్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నాగుప్తా లాలూను రహస్యంగా కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. లాలూను కలిసిన మంత్రి ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి గుప్తా మాట్లాడుతూ.. లాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బ్లడ్ షుగర్ కొద్దిగా ఎక్కువ ఉందని, వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని తెలిపారు.లాలు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు తాను వైద్యుల కారులోనే ఆసుపత్రికి వెళ్లినట్టు చెప్పారు. లాలూను బన్నాగుప్తా కలుసుకోవడం ఇది రెండోసారి కావడంతో వీరి మధ్య రాజకీయపరమైన చర్చలు నడుస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.