telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌కు చెందిన ఆర్మీ జవాన్ మిస్సింగ్‌..

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాన్ కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్.. విధులు నిర్వహించేందుకు వెళ్తుండగా ఉన్నట్టుండి.. ఫోన్ స్విచాఫ్, ఆ వెంటనే ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు.

ఎన్నో కష్టాలకు ఓర్చి చిన్నవయసులోనే అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆర్మీలో ఉద్యోగం పొందాడు. చిన్నప్పటి నుంచి ఆర్మీలో పని చేయాలన్న తపన.. దేశంపై ప్రేమ, అభిమానమే.. ఆ యువకున్ని ఆర్మీ లోకి వెళ్లేలా చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోకురి సాయి కిరణ్ రెడ్డి 6 నెలల క్రితం సైన్యంలో చేరారు. పంజాబ్ సరిహద్దులో ఫరీద్‌కోట (గన్నర్‌)గా పనిచేస్తున్నారు. మూడు వారాల క్రితం సెలవుపై స్వగ్రామం వచ్చారు.

సెలవులు పూర్తయ్యాక అనంతరం డిసెంబర్ 7న విధులు నిర్వర్తించడం కోసం డిసెంబర్ 5న పయనమయ్యాడు.  హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత సోదరుడు భాను ప్రకాష్ రెడ్డి , క‌టుంబ స‌భ్యుల‌తో చివరిసారిగా ఆ రోజు రాత్రి ఫోన్‌లో మాట్లాడారు.

ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్చాఫ్ రావ‌డంతో వారు పంజాబ్‌ ఫరీద్‌కోటలోని సైనికాధికారులను సాయికిరణ్ రెడ్డి తల్లిదండ్రులు సంప్రదించారు. అయితే విధుల్లో చేరలేదని సైనికాధికారులు చెప్పడంతో.. వారిలో టెన్షన్‌ మరింతగా పెరిగింది. 

ఈ క్రమంలోనే వారు చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..జీరో ఎఫ్ఐఆర్ చేసిన చర్యలు పోలీసులు ఈ కేసును ఢిల్లీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు వారు అక్కడ కేసు నమోదు చేసినట్టుగా చేర్యాల పోలీసులు తెలిపారు. 

ఆర్మీ అధికారులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సెక్యూరిటీ సాయంతో సీసీటీవీ ఫుటేజ్‌ చెక్ చేశారు. అందులో డిసెంబర్ 6వ తేదీ రాత్రి సాయికిరణ్ రెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లినట్టుగా తేలింది. అస‌లు బ‌య‌ట‌కు వెళ్ళిన మ‌నిషి ఏమ‌య్యారు. ఫోన్ ఎందుకు స్విఛ్ఛాప్ వ‌స్తుంది అనే కోణంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కాగా..సాయికిరణ్‌ కనిపించకుండా పోవడంపై గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి, మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్లో సమాచారం ఇచ్చాడు

Related posts