telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్‌ల నేతల అరెస్టును ఖండిస్తూ డీఎంకే ధర్నా

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో నేతల అరెస్టును ఖండిస్తూ డీఎంకే పార్టీ గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు.

కశ్మీర్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, అమర్ అబ్దుల్లా నేతలు కూడా ధర్నాకు హాజరయ్యారు.కశ్మీర్‌లో అరెస్టు చేసిన నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీతారాం ఏచూరి, డి.రాజా, గులాంనబీ అజాద్, ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరై నిరసన తెలిపారు. ఈ ధర్నాలో విపక్ష పార్టీలు కూడా పాల్గొన్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.

Related posts