telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన..

నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు గడ్డ లో సలీం కుటుంబాన్ని పరామర్షించనున్న షర్మిల…మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యా యత్నం చేసుకున్న నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం హుజుర్ నగర్ లో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు వైఎస్ షర్మిల. అలాగే కోదాడ సమీపంలోని దొండపాడులో మహానేత వైఎస్‌ఆర్‌ గారి అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు.

Related posts