telugu navyamedia
సినిమా వార్తలు

శేఖర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివానీ ఎమోష‌న‌ల్ స్పీచ్‌కు ఫిదా..

రాజశేఖర్‌ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్‌ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు.

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ క్ర‌మంలో శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వ‌హించారు. ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో శివాని స్పెషల్ స్పీచ్ కు అందరూ ఫిదా అయిపోయారు. అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పిన శివాని తన కుటుంబంపై బయట చాలా అపోహలు ఉన్నాయని.. రాజశేఖర్ గారి జీవితాన్ని జీవిత నాశనం చస్తోందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. ఆమే తమన రూల్ చేస్తుందంటూ అంటుంటారు.. బట్ మేము అవేమి పట్టించుకోంఅన్నది శివాని, అంతే కాదు ఈసినిమాను అమ్మ అద్భుతంగా డైరెక్ట్ చేసిందని కితాబిచ్చింది శివాని

ఇక తన తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు శివాని. తన వల్లే తన తండ్రి ప్రాణాలకు ప్రమాదం వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తననుంచి తన తండ్రికి కోవిడ్ వచ్చిందని చెప్పింది శివాని. నాకు కోవిడ్ త్వరగా తగ్గిపోయింది. కాని నాన్నకు బాగా సీరియస్ అయ్యింది. డాక్టర్స్ ఒక దశలో 50‌-50 ఛాన్సెస్ అన్నారు మాకు ఏం చేయాలో అర్ధం కాలేదన్నారు శివాని.

నాన్నకు బాగా సీరియస్ అవ్వడంతో నా మీద నాకు కోపం వచ్చింది. నేను నష్ట జాతకురాలిని, అని బయట వారు అన్నారు. నాకు కూడా అదే అనిపించింది అంటూ శివాని ఆవేదన చెందారు. ఒక దశలో ఆయన ఆక్సిజన్ లెవల్స్ 58 వరకూ పడిపోయాయి.. దాంతో ఆయన కూడా తన పరిస్థితి ఏంటీ అని బాధపడ్డారు అంటూ శివాని అన్నారు.

నాన్న మాట్లాడటానికి కూడా అవకాశం లేనంతగా సిక్ అయ్యారు.. నావల్లే కదా నాన్నా మీకు ఈ పరిస్థితి అని అంటే.. ఓపికలేకపోయినా.. ఆక్సిజన్ మాస్క్ తీసి.. అదేంటిరా.. నువ్వ కాకపోతే ఎవరివల్ల అయినా వచ్చేది. నీవల్లే వచ్చిదని బాధపడకు అంటూ.. ఓదార్చారు. దేవుడి దయ వల్ల నాన్నమళ్ళీ మాకు దక్కారు అంటూ శివాని అన్నారు. శివాని మాట్లాడుతుండగా.. శివాత్మిక కూడా ఎమోషన్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈసినిమా కోసం నాన్న చాలా రిస్క్ లు చేశారు. శేఖర్ మూవీలో క్యారెక్టర్ కోసం జిమ్ చేసి.. వెయిట్ పెరిగారు. అదే టైమ్ లో కరోనా రావడంతో ఆయన వెయిట్ 60కి పడిపోయింది. కాని ఆయన బెడ్ మీద నుంచి చిన్నగా లేవడం, నడవడం, మెట్లు ఎక్కడం, దిగడం, వాకింగ్,జాగింగ్.. ఇలా నెలన్నరలో ఆయన అన్ని పర్ఫెక్ట్ గా చేసి.. జిమ్ కు వెళ్ళి మళ్లీ 75 కేజీలకు వచ్చారు అంటూ ఆనందంగా చెప్పింది శివాని.

అంతే కాదు ఈసినిమాలో క్యారెక్టర్ కు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటంది. సిగార్ తాగాలి.. కాని నాన్నలంగ్స్ కోవిడ్ వల్ల దాదాపు 7‌0 శాతం ఎఫెక్ట్ అయ్యాయి. నేను వద్దు.. వేరే ఇంకేదైనా చూద్దాం.. అన్నాను. కాని నాన్న ఈపాత్రకు స్మోక్ ఉంటేనే బాగుంటుంది. కావాలంటే హెర్పల్ వి తెప్పిద్దాం.. నేను కూడా లోపలకు తీసుకోకుండా పై పైన సిగరెట్ కాలుస్తాను అంటూ సినిమా కోసం రిస్క్ చేశాడన్నారు శివాని.

తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుటూ ఓ పాటను అద్భుతంగా పాడి వినిపించారు శివాని, తన తల్లి తండ్రులు, సోదరి తన బలం అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఆయ‌న పున‌ర్జ‌న్మ‌లో వ‌స్తున్న‌ ఫ‌స్ట్ మూవీ అని, మే 20కి మీ ముందుకు రాబోతుంది..అంద‌రూ థియేట‌ర్‌కి వెళ్ళి సినిమా చూడాల‌ని శివాని చెప్పారు.

Related posts