telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రతి సమస్య పరిష్కారంకు మీ ముందు ఉంటాము : అనిల్ కుమార్ వల్లభనేని

చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన… వినోద్ బాల ప్యానెల్ మీద ఉన్న నమ్మకం తో మా అందరిని మెజారిటీతో గెలిపించి మీ అందరికి సేవ చేసుకొనే బాధ్యత కల్పించి, ఆదరించినందుకు మేము అందరిని కలుపుకొని బుధవారం ఉదయం 10 గంటలకు అధ్యక్షులు గా ప్రమాణ స్వీకారం చేసి నా సహచరులు వైస్ ప్రెసిడెంట్ గా వి. ప్రవీణ్ కుమార్ యాదవ్, సెక్రటరీ గా కాదంబరి కిరణ్, కోశాధికారి గా అనుముల మహానంద రెడ్డి, కమిటీ సభ్యులు దోరై, అలహరి, రామకృష్ణ ప్రసాద్, బత్తుల రఘు, దీప్తి వాజపేయి, అనిత, టి. లలిత గారి తో బాధ్యతలు తీసుకోని , అందుబాటులో ఉండి ప్రతి సమస్య పరిష్కారం కు మీ ముందు ఉంటాము. మీ అందరికి తెలియజేసిన విధంగా బాధ్యతలు స్వీకరించిన 10 రోజులలో అందరి అభిప్రాయాలు తీసుకోని ముందుకు వెళ్తాము. అందరు సహకరించగలరు అని మనవి అని కోరారు.

Related posts