telugu navyamedia
సినిమా వార్తలు

“హీరో”గా మారనున్న విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

పెళ్ళి చూపులు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ విజయ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత “నోటా”తో డీలాపడినా, “గీతగోవిందం, టాక్సీవాలా”తో మళ్ళీ తన సత్తా చాటుకున్నాడు. అంతేకాదు యూత్ లో అమాంతం తన క్రేజ్ ను పెంచేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

మరోవైపు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు విజయ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 9గా ఈ సినిమా రూపొందనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకు “హీరో” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ప్రకటించింది చిత్రయూనిట్. చిత్రాన్ని ఏప్రిల్ 22 న ఢిల్లీలో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే నటించనుందని టాక్.

అయితే మెగాస్టార్ చిరంజీవి “హీరోగా నటించిన “హీరో” చిత్రం ఆయనకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. కానీ ఆ తరువాత అదే టైటిల్ తో వచ్చిన యువహీరోలు మాత్రం పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ “హీరో”గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ “హీరో” విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ను మరో స్థాయికి చేరుస్తుందేమో చూడాలి.

Related posts