ప్రముఖ టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్‌పై మధ్యప్రదేశ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ‘ట్రిపుల్ ఎక్స్ సీజన్ 2’ వెబ్ సిరీస్ లో ఆర్మీని అవమానించిందని, భారతీయ శిక్షాస్మృతి ఐటి చట్టం, స్టేట్ ఎంబెల్మ్ ఆఫ్ ఇండియా చట్టం 2005, 294, 298 (అశ్లీల చర్యలు), 298 (మతపరమైన భావాలను కించపరచాలనే ఉద్దేశ్యం) సెక్షన్ల కింద ఏక్తా కపూర్, ఇతరులపై కేసు నమోదు చేయబడింది. ఈ వివాదంపై తాజాగా స్పందించిన ఏక్తా.. ఇండియన్ ఆర్మీని మేము ఎంతగానో గౌరవిస్తాం. వారు మన దేశానికి చేస్తున్న సేవలు అభినందనీయం. ఇప్పటికే ఆ సీన్స్‌ని తొలగించాం. మా వలన ఎవరైన మనోభావాలని దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అత్యాచార బెదిరింపులు, ట్రోల్స్‌ని మేం పూర్తిగా వ్యతిరేఖిస్తున్నాం అని ఏక్తా చెప్పుకొచ్చింది.
previous post
next post