telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బావరాజ్యం” అంటూ మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయబోతున్నాడా వర్మ ?

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు “మర్డర్”, “థ్రిల్లర్” అంటూ మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. తాజాగా మరో సంచలనానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బడా నిర్మాత అల్లు అరవింద్‌పై మూవీ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నేపథ్యంలో ఆ సంగతులన్నీ చూపిస్తూ అల్లు అరవింద్‌ని హైలైట్ చేసేలా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు ‘బావ రాజ్యం’ అనే టైటిల్ కూడా వర్మ కన్ఫర్మ్ చేసి పెట్టుకున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇక తన సినిమాలకు థియేటర్స్‌తో పని లేదన్నట్లుగా దూసుకుపోతున్న ఆర్జీవీ.. సొంతంగా ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్ RGV World Theatre ప్రారంభించారు. దీనిపై ఇటీవలే పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ‘పవర్ స్టార్’ సినిమాను విడుదల చేసి సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఈ క్రమంలో వర్మ ఆఫీసుపై పవన్ ఫ్యాన్స్ దాడి.. ‘పవర్ స్టార్’కు పోటీగా ఆర్జీవీ రియల్ క్యారెక్టర్ చూపిస్తూ మరో సినిమా విడుదల కావడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కితగ్గలేదు వర్మ.

Related posts