telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

బ్యాంకులే దొంగలు .. వడ్డీ కోసం మాకు.. : విజయ్ మాల్యా ఆరోపణలు

vijaymalya to india will become a dream

విజయ్ మాల్యా బ్యాంకులపై విరుచుకుపడ్డాడు, తమలాంటి వాళ్ళ కోసం బ్యాంకులు అధిక వడ్డీ ప్రత్యేకంగా కేటాయిస్తారని ఆరోపించారు. అందుకే తనను దొంగ దొంగ అంటున్నవారంతా మెదడులేనివారని వ్యాఖ్యానించారు. బ్యాంకులకు తన సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను అన్నింటినీ కడతానని ఏడాది కాలంగా చెబుతున్నా బ్యాంకులేవీ పట్టించుకోవడం లేదని, ఇక దొంగెవరో తేల్చుకోవాలని ఆయన కోరారు. పైగా, తాను దొంగను కాదనీ, బ్యాంకులే దొంగలన్నారు. భారత్‌లోని పలు బ్యాంకుల నుంచి వేలాది కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నారు.

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో కలసి దిగిన ఫొటోను మాల్యా పోస్ట్ చేయగా, పలువురు నెటిజన్లు ‘దొంగ… దొంగ’ అని కామెంట్లు పెట్టారు. దీనిపై విజయ్ మాల్యా స్పందించాడు. తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్‌ క్రిస్ గేల్‌ను కలడవం ఆనందాన్ని కలిగించిందన్నారు. తనను కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తున్నారని, తనను దొంగ అంటున్నవారంతా మెదడులేనివారేనని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బులు వసూలు చేయమని మీ బ్యాంకులను నిలదీయాలని, తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానని సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. అందువల్ల దొంగ ఎవరో? తేల్చుకోవాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

Related posts