telugu navyamedia
సినిమా వార్తలు

డియ‌ర్ కామ్రేడ్‌ : “క్యాంటీన్…” వీడియో సాంగ్

Dear-Comrade

సెన్సేష‌న‌ల్  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ఈ  సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 17న నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తాజాగా “క్యాంటీన్…” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందము. ఈ వీడియో సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను మీరు కూడా వీక్షించండి.

Related posts