telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళను కూడా ఎన్‌కౌంటర్ చేయాలి… పీకేపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్

Srireddy

దేశవ్యాప్తంగా దిశా అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ పై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. తాజాగా శ్రీరెడ్డి ఘటనపై మాట్లాడుతూ.. అత్యాచార నిందితులకు పోలీసులు ఎన్‌కౌంటర్‌తో తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇలాంటి ఘటనతో అత్యాచారం చేయాలనున్న వాళ్ల ఒంట్లో వణుకు పుట్టేలా చేసారన్నారు. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. “మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పీకే లాంటి వాళ్లను కూడా తెలంగాణ పోలీసుల మాదిరే ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలి” అంటూ సంచలన పోస్ట్ చేసింది. అందులో పీకే అంటూ చెప్పినా.. అది పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందే అని అనుకుంటున్నారు నెటిజన్లు.

Related posts