సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా “నిను వీడని నీడను నేనే”. విస్తా డ్రీమ్ మర్చంట్స్, కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్-1), వి స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ దెయ్యం కాన్సెప్ట్ తో భయంకరంగా కొనసాగింది. సందీప్ కిషన్ కు ఈ సినిమా అయినా హిట్ ను తెచ్చి పెడుతుందేమో చూడాలి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.