telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” ఈవెంట్ కు అల్లు అర్జున్ దూరం ?

Allu-Arjun

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్‌ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చిత్రంలోని తొలి పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసభ్యులతో పాటు నిర్మాతలు డి. సురేశ్‌బాబు, జెమినీ కిరణ్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, డీవీవీ దానయ్య, శరత్‌ మరార్‌, దర్శకుడు మోహర్‌ రమేశ్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయిమాధవ్‌ బుర్రా తదితరులు హాజరయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్ సినీ ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించింది. అయితే వేడుకలో దాదాపు మెగా హీరోలందరూ కనిపించగా అల్లు హీరోలు మాత్రం హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మెయిన్ గా అల్లు అర్జున్ ఈవెంట్ కి రాకపోవడం సరికొత్త అనుమానాలకు దారి తీస్తోంది. “సైరా” ప్రమోషన్స్ లో మెగా హీరోలందరూ మెగాస్టార్ పోటోలను టీజర్స్ ట్రైలర్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటే బన్నీ మాత్రం పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఒకవేళ షూటింగ్ లో బిజీగా ఉండి అందుబాటులో లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా సరిపోయేది. కానీ బన్నీ అందుబాటులో ఉన్నా కూడా సైరా ఈవెంట్ కి రాలేదు అనే గాసిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related posts