telugu navyamedia
సినిమా వార్తలు

స్నేహితురాలే భార్య కావడం ఆనందంగా ఉంది: కార్తికేయ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే కార్తికేయ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరా? అని ఆయన అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. తాజాగా ఆ సంగతుల్ని కార్తికేయ స్పందించాడు. ఆమె పేరు లోహిత. వరంగల్‌ ఎన్‌.ఐ.టి.లో చదువుతున్నప్పుడు (2010) ఇద్దరికీ పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఏడడుగుల బంధం కాబోతుంది. ‘నా స్నేహితురాలే భార్యగా నా జీవితంలోకి వస్తుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2010 నుంచి మాకు పరిచయం ఉంది. లోహితని తొలిసారి వరంగల్ ఎన్‌.ఐ.టి. లో కలిశాను’ అని కార్తికేయ తన మనసులో మాట పంచుకున్నారు.

ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. గుణ 369, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో పలకరించాడు. నానీ గ్యాంగ్‌లీడర్‌ మూవీలో విలన్‌గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్‌ వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

Related posts