telugu navyamedia
సినిమా వార్తలు

“వాల్మీకి” విడుదలకు ముహూర్తం ఖరారు

Valmiki

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా షూటింగు రెగ్యులర్ గా కొనసాగుతూనే వుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటించారు చిత్రబృందం. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు స్పష్టం చేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Related posts