telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బ్రదర్ రియాలిటీ షో : కంటెస్టెంట్ పై రేప్ లైవ్ లో…!

Spanish

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో స్పెయిన్‌లో కూడా జరుగుతోంది. అక్కడ ఈ షోను ‘గ్రాన్ హర్మనో రెవల్యూషన్’ అంటారు. 2017లో జరిగిన ఈ షోలో కార్లోటా ప్రాడో అనే యువతి కూడా పాల్గొంది. ఈ షోలో ఆమెతో పాటు ప్రియుడు జోసా కూడా పాల్గొన్నాడు. అయితే రియాల్టీ షోలో భాగంగా బిగ్ బ్రదర్ హౌజ్‌లో పార్టీ జరిగింది. దాంతో అందరూ బాగా తాగి చిందులేశారు. ఆ తర్వాత స్పృహలేకుండా ఎలా పడితే అలా పడుకున్నారు. ఆ క్రమంలో కార్లోటా ప్రియుడు, స్నేహితుడు హౌజ్‌లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ అయింది. అయితే మరుసటి రోజు బిగ్ బ్రదర్ హౌజ్‌లో కంటెస్టెంట్‌పై రేప్ జరిగిందని నిర్వాహకులకు తెలీడంతో నిందితుడు జోసాను హౌజ్‌ నుంచి పంపించేశారు. ఆ తర్వాత కార్లోటాను ఓ గదిలోకి తీసుకెళ్లి రేప్ జరిగినప్పుడు రికార్డ్ అయిన ఫుటేజ్‌ను చూపించారు. దాంతో ఆమె షాకయ్యారు. ‘ఇక ఆపండి’ అంటూ కేకలు వేశారు. ఆ వీడియో చూశాక ఆమె బోరున విలపించారు. ఆ తర్వాత జోసాను పోలీసులకు పట్టించారు. అయితే స్పానిష్ ప్రభుత్వం చట్టం ప్రకారం జోసా చేసింది పనిని అత్యాచారంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ ఘటన జరిగింది 2017లోనే అయినా ఇప్పటికీ ఈ ఘటనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీలైతే ప్రచారం కోసం రేప్ ఫుటేజ్‌ను యాడ్స్ రూపంలో ప్రసారం చేశాయి కూడా. ఆ తర్వాత ఆ ఫుటేజ్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ షోకు స్పాన్సర్లు రావడం మానేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని బిగ్ బద్రర్ నిర్వాహకులపై కేసు పెట్టాలని పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. 2007లో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి బిగ్ బ్రదర్ ఐదో సిరీస్‌లో విన్నర్‌గా నిలిచారు. ఈ షోలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అదీకాకుండా ఆమె నల్లగా ఉన్నారని జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. శిల్పా శెట్టిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు యూకే, భారత ప్రభుత్వాలు 2008లో జరగాల్సిన సీజన్‌ను సస్పెండ్ చేశాయి. ఆ తర్వాత షోలోని కంటెస్టెంట్స్ శిల్పా శెట్టికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత శిల్ప మీడియాతో మాట్లాడుతూ తనపై కామెంట్ చేసిన వారిని క్షమించానని తెలిపారు.

Related posts