telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాపై విజయ్ దేవరకొండ స్పెషల్ వీడియో

vijay-devarakonda

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఈ వైరస్ ఇక్కడ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హీరో విజయ్ దేవరకొండ కరోనాపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం విజయ్‍‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించాడు విజయ్ దేవరకొండ. షేక్ హ్యాండ్‌లు వద్దు పద్దతిగా నమస్కారం పెట్టాలంటూ వీడియోలో సూచనలు చేశారు.

 చేతిని తరుచుగా సబ్బుతో కడుక్కోండి. మీ కళ్లని, ముక్కు, నోటిని, చెవిని చేతితో తాకకండి. ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వాళ్ల నుంచి కనీసం మూడడుగుల దూరంలో ఉండండి. రద్దీ ప్రాంతాలకు వెళ్లకండి. మనమందరం కరోనా వైరస్‌ను అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే 104 నెంబర్‌కు కాల్ చెయ్యండి’’ అని వీడియోలో విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఈ వీడియోని విజయ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

Related posts