telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వైల్డ్‌ డాగ్‌”… నాగార్జున ఫస్ట్ లుక్

wild-dog

కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం “వైల్డ్‌ డాగ్‌”. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడు. శుక్రవారం నాగార్జున ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఎన్‌ఐఏ అధికారిగా చేతిలో తుపాకితో వార్త పత్రికలో ప్రచురితమైనట్లుగా ఉన్న నాగార్జున ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తుంది. వైవిధ్యమైన లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. “అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌వర్మ సీక్రెట్‌ ఇన్వేస్టిగేషన్‌ మొదలుపెట్టారు. ఆయన అన్వేషణ ఎందుకోసమన్నదే ఈ చిత్ర ఇతివృత్తం” అని అంటున్నారు నాగార్జున. నిర్మాతలు మాట్లాడుతూ “ఈ సినిమాలో నాగార్జున వైల్డ్‌డాగ్‌ విజయ్‌ వర్మ అనే పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నారు.యథార్థ ఘటనల ఆధారంగా సృష్టించిన ఆయన పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. రహస్య పోలీస్‌ ఆపరేషన్‌లో విజయ్‌వర్మకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది. తొలి షెడ్యూల్‌ పూర్తయింది” అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ షానియల్‌ డియో అందిస్తున్నారు. ఎ.సి.పి విజయ్‌ వర్మ… ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌! తీవ్రవాదులపై మెరుపుదాడి చేసి… కాల్చి చంపడంలో ఆరితేరిన ఎన్‌ఐఎ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) ఆఫీసర్‌. చాలాసార్లు సీక్రెట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించి, తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంతో విజయ్‌ వర్మకు ‘వైల్డ్‌ డాగ్‌’ అనే పేరు వచ్చింది.

Related posts