telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాంకర్ వర్షిణితో ఎఫైర్… స్పందించిన హైపర్ ఆది

varshini

పవర్ ఫుల్ పంచ్‌లతో ప్రేక్షకులను “జబర్దస్త్”గా నవ్విస్తాడు హైపర్ ఆది. అతని కామెడీ స్కిట్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం టీవీ రేటింగ్‌ల పరంగానే కాదు, యూట్యూబ్‌లో స్కిట్ రిలీజైన రెండు రోజులవరకు అదే ట్రెండింగ్. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. దీంతో ఇప్పుడు ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అబ్బో అంటూ అంతా పొగిడేస్తుంటే.. ఈ మధ్యే మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందిలెండీ అంటూ హైపర్ ఆది హింటిచ్చాడు. యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత వర్షిణికి జోడీ అయిపోయాడు హైపర్ ఆది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అంతా తూచ్.. మేం చేసేది రేటింగ్స్ కోసమే అని క్లారిటీ ఇచ్చాడు.

Related posts