telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేఎస్‌ బ్రహ్మనందరెడ్డి కీలక ప్రకటన చేశారు. 2021 జనవరి 8వ తేదీ నుంచి 13 వరకూ పొరుగు రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు కేఎస్ బ్రహ్మనందరెడ్డి.  హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1251 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ఇక బెంగళూరు నుంచి 443, చైన్నై నుంచి 133 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201, విశాఖ పట్నంకు 551 బస్సులు నడపనున్నారు. అలాగే అంతర్గతంగా వివిధ జిల్లాల మధ్య 1038 ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. ప్రయాణికుల తాకిడిని బట్టి బస్సులు సంఖ్య కూడా పెంచేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధంగా ఉందని కేఎస్ బ్రహ్మనందరెడ్డి స్పష్టం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటనతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Related posts