telugu navyamedia
సినిమా వార్తలు

అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో నిశ్చితార్ధం కాన్సిల్‌..!

అఫ్గానిస్థాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లిపోవటంతో…అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఆ దేశంలో నెలకొన్న సంక్షోభం కారణంగా..ఆ దేశ క్రికెటర్ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 11, 14 కంటెస్టెంట్‌ అర్షి ఖాన్.

Arshi Khan reveals she was 'about to get engaged to an Afghanistan cricketer' before the Taliban takeover

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ఓ అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో ఈ ఏడాది అక్టోబర్‌లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే. ఆ అబ్బాయిని మా నాన్న సెలక్ట్‌ చేశారు.

Actress Arshi Khan Feels Her Engagement To An Afghanistani Cricketer Might Be Cancelled As Taliban Takes Control

ఆ క్రికెటర్‌ మా నాన్న స్నేహితుడి కుమారుడు. కానీ తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. అయినప్పటికి కూడా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నాకనిపిస్తుంది.. నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయి ఉంటాడు”’’ అని తెలిపారు.

Most celebs and commoners are very boring in Bigg Boss 12- Arshi Khan

అయితే ఈ ఇంటర్వ్యూలో అర్షి ఖాన్‌ తన అఫ్గనిస్తాన్ మూలాల గురించి కూడా చెప్పింది. ”తాను అఫ్గనిస్తాన్‌ పఠాన్‌ను. నా కుటుంబం యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందినది. నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చారు.. భోపాల్‌లో జైలర్‌గా ఉన్నారు. నా మూలాలు అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి.. అయినప్పటికి నేను భారతీయ పౌరురాలినే” అన్నారు అర్షి ఖాన్. ఇక ఆమె 4వ ఏట ఉన్నప్పుడు అర్షి ఖాన్‌ తల్లిదండ్రులు అఫ్గన్‌ నుంచి ఇండియాకు వలస వచ్చారంటూ చెప్ప‌కొచ్చింది ఈ భామ‌.

अर्शी खान को अफगानी क्रिकेटर से रिश्ता टूटने का डर, अक्टूबर में होनी है सगाई - Cricket AajTak

Related posts