telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహర్షి .. కలెక్షన్స్ అంతా బూటకమేనా..!

Maharshi

మహర్షి చిత్రం తొలి వారంలో మెప్పించే వసూళ్లు రాబట్టుకుంది. సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన వసూళ్లు చాలా గొప్పే. అయితే వచ్చిన వసూళ్లకు చెపుతోన్న లెక్కలకు పొంత అసలు లేదని ఇండస్ట్రీ ట్రేడ్ టాక్‌. టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్‌లో వీరకుమ్ముడు కుమ్మేసిన మహర్షి వీకెండ్ తర్వాత డ్రాప్ అయ్యింది. వీకెండ్ తర్వాత ఎక్కవ థియేటర్లలో ఉండడంతో అది షేర్ కొంత వరకు మింగేసింది. మహర్షి రెండో వీక్‌లోకి ఎంటర్ కావడంతో అసలు అగ్నిపరీక్ష మొదలైంది. సీడెడ్, ఓవర్సీస్ లాంటి చోట్ల మహర్షికి భారీ నష్టాలే తప్పకపోవచ్చు. రెండో వారంలో కాస్త స్టడీగా ఉంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక మహర్షి కలెక్షన్లు పెంచేందుకు టోటల్ మహర్షి టీం ఆడుతోన్న ఎక్సర్‌సైజ్‌లు మరీ ఓవర్‌గాను, మితిమీరిన డ్రామాగాను ఉన్నాయన్న చర్చలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మహేష్ ఏకంగా కాలర్లు ఎగరవేయడాలు, నమ్రత సిస్టర్స్‌తో కిందామీదా పడుతూ ఫొటోలు దిగడాలు, పార్టీల మీద పార్టీలు ఇవ్వడాలు ఇవన్నీ ప్రతి ఒక్కరు సినిమా చూసేందుకు చేస్తోన్న ఎత్తుగడల్లో భాగమే అంటున్నారు. నిజంగా సినిమా బాగుంటే ఇన్ని ఎక్సర్ సైజులు అక్కర్లేదు. సినిమాను థియేటర్లకు రప్పించడానికి ప్రేక్షకుల మౌత్ టాక్‌కు మించింది లేదు. ఇక ట్రేడ్ వర్గాలు కూడా వీళ్లు ఆడుతోన్న డ్రామా ఎంత వరకు ఆడతారో ? అసలు కలెక్షన్లు ఎంత వరకు వస్తాయో ? చూశాకే అసలు కలెక్షన్లు బయట పెడతాం అన్నట్టుగా వేచి చూస్తున్నారు.

వసూళ్లు పెంచేందుకు మహర్షి టీం అష్టకష్టాలు పడుతోన్న వేళ అసలు కలెక్షన్లు బయట పెట్టి రాద్దాంతం చేయడం ఎందుకనే బయ్యర్లు, ట్రేడ్ వర్గాలు సైలెంట్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లకు చెపుతోన్న దానికి కాస్త తేడా ఉందనే అంటున్నారు. ఇంకా మహర్షి రూ.35 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే రూ.60 కోట్ల గ్రాస్ పైమాటే. ఈ వారంలోనే ఏబీసీడీ విడుదల అయ్యింది, వచ్చే వారం సీత వస్తోంది. రెండో వారంలో మహర్షిని ఖాళీ చేసి మజిలీ, జెర్సీ, చిత్రలహరి, అవెంజర్స్‌, కాంచన 3 వేస్తున్నారు. ఏదేమైనా వసూళ్లు పెంచేందుకు మహర్షి టీం చేస్తోన్నదంతా చాలా ఓవర్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది!

Related posts