telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఒరేయ్ బుజ్జిగా” రివ్యూ

Orey-Bujjiga

బ్యాన‌ర్‌: శ‌్రీస‌త్యసాయి ఆర్ట్స్‌
నటీనటులు : రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ తదితరులు
దర్శకుడు: విజయ్ కుమార్ కొండా
సంగీతం: అనూప్ రూబెన్స్‌
కెమెరా: ఆండ్రూ
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీశ్‌
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌

కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో చాలా సినిమాల విడుదల ఆగిపోయింది. కొన్ని నెలలుగా సినిమా థియేటర్ల ఓపెన్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు ఎట్టకేలకు వరుసగా సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తున్నారు. తాజాగా రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన “ఒరేయ్ బుజ్జిగా” చిత్రం అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదలైంది.

కథ :
భీమవరానికి చెందిన బుజ్జిగాడు (రాజ్ తరుణ్) కు పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేక ఇంట్లో నుంచి పారిపోతాడు. అదేరోజు అదే ఊరుకి చెందిన కృష్ణవేణి (మాళవిక నాయర్) కూడా అలాగే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోతుంది. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే ట్రైన్ లో ఎక్కుతారు. అయితే ఇద్దరూ ఒకే రోజు జంప్ చేయడంతో వీరిద్దరూ లేచిపోయారని ఊరంతా అనుకుంటారు. దాంతో ఆమె బుజ్జిగాడు మీద పీక‌ల‌దాకా కోపం పెంచుకుంటుంది. మ‌రోవైపు కృష్ణ‌వేణి కార‌ణంగా ఇంట్లో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని తెలుసుకున్న బుజ్జిగాడు. ఆమెను వెతికి ప‌ట్టుకొస్తాన‌ని అమ్మ‌కు ప్రామిస్ చేస్తాడు. ఊళ్లో ఉన్న వీళ్ల ఇద్దరి కుటుంబ సభ్యులు ఒకరికొకరు శత్రువులుగా మారతారు. మరోవైపు బుజ్జిగాడు శ్రీను పేరుతో.. కృష్ణవేణి స్వాతి పేరుతో ఒకరికొకరు పరిచయమవుతారు. ఆ తరవాత వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? తరువాత ఇద్దరి కుటుంబాల మధ్య ఏం జరిగింది ? చివరకు కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :
రాజ్ తరుణ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయాడు. కామెడీ టైమింగ్ బాగుంది. అయితే రాజ్ తరుణ్ ఇంతకుముందు కూడా ఇలాంటి పాత్రల్లోనే నటించాడు. రాజ్ తరుణ్, సప్తగిరి, మధు నందన్, సత్య కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు బాగున్నాయి. ఇక మాళవిక నాయర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమాలోఆమె కాస్త సన్నగా కన్పించారు. హెబ్బా పటేల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. చాలా కాలం తరవాత మళ్లీ తెరపై కనిపించిన వాణీ విశ్వనాథ్ తన పాత్రలో హుందాతనాన్ని తన నటనలో చూపించారు పోసాని కృష్ణమురళి, వీకే నరేష్, మధునందన్, రాజా రవీంద్ర, అన్నపూర్ణ, సత్యం రాజేష్ తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు విజయ్ కుమార్ ఈ కన్‌ఫ్యూజన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ను తెరకెక్కించారు. అయితే కథనాన్ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు నడిపించలేకపోయారు. కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. ఫస్టాఫ్‌ను డీసెంట్ కామెడీతో బాగానే నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను మాత్రం కాస్త సాగదీశారు. సెకండాఫ్‌లో వచ్చే హాస్పిటల్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంది. ఈ సినిమాకు ప్రధాన బలం కామెడీ. రాజ్ తరుణ్‌ ఫైట్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆండ్రూ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. నంద్యాల రవి రాసిన మాటలు, నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts