బీజేపీపై మరోసారి మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు లక్షాముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని.. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని.. ఒక్కటి కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీపై పిచ్చికూతలు కూసే వారిని నిలదీయాలని…పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించే గొంతుకు కాదు పరిష్కరించే గొంతుక అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కరెంటు కోసం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పదంతా మోసమేనని…టీఆర్ఎస్ కార్యకర్త గల్లా ఎగరేసుకొని తిరగాలని తెలిపారు. రైతు బిడ్డగా పుట్టినవారు టిఆర్ఎస్ పార్టీకి ఓటేయకోతే మోసం చేసినట్టేనని వెల్లడించారు. జనగామకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని..కాజీపేటలో వేసే కోచ్ ప్యాక్టరీని ఉత్తర ప్రదేశ్ కు తరలించిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మెచ్చుకున్న కేంద్రం… నిధులు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య ముగ్గురం కలిసి సిఎం కేసీఆర్‌ను ఒప్పించి జనగామ జిల్లా సాధించుకున్నామని గుర్తు చేశారు.
previous post
next post
ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా… సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్