కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండస్ట్రీలని షాక్‌కి గురి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 2020లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్రని సస్పెన్స్‌లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని జూలై 29 ఉదయం 10గం.లకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా అధీరా క్యారెక్టర్ ప్రీ లుక్ విడుదల చేయగా ఇందులో అధీరా పాత్ర పోషిస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి పిడికిలి బిగించి ఉన్నాడు. అతని వేలి ఉంగరాన్ని హైలెట్ చేస్తూ ప్రీ లుక్ డిజైన్ చేసారు. హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. చిత్రంలో ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్, ఉపేంద్ర నటిస్తున్నట్టు తెలుస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
previous post
మూవీ మాఫియా “మణికర్ణిక”ను చంపాలనుకుంది… కంగనా సంచలన వ్యాఖ్యలు