telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీసీసీ చీఫ్ గా రేవంత్‌ రెడ్డి..! ప్రకటన ఎప్పుడంటే

Revanth-Reddy mp

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర ఓటమి తరవాత పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ పదవికి జీవన్ రెడ్డి , రేవంత్ రెడ్డి లలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యువ నాయకత్వం ఉంటేనే కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం ఉందని ఆలోచించిన పార్టీ పెద్దలు పీసీసీ చీఫ్ ను రేవంత్ కు అప్పగించారు. ఈ నిర్ణయంపై రేవంత్ సపోర్టర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందే ఈ ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రకటన ఎప్పుడు వస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Related posts