కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటికే స్పుత్నిక్ వీ పేరిట ఓ వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసేందుకు రష్యా సిద్దమైంది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ డెవలప్ చేస్తున్న ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయనుంది.
అక్టోబర్ 15 నాటికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మొదటి దశ ట్రయల్స్ ఫలితాలు గత వారమే పూర్తయ్యాయి. రష్యా తయారీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడవ దశ ప్రయోగాల్లో ఇండియా కూడా భాగం కానుంది. ఇండియాకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా ఈ జాబితాలో ఉన్న విషయం విధితమే.