telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్.. ఆస్పత్రుల పర్యటన సిగ్గుచేటు : ఉత్తమ్

 కరోనా వచ్చిన 18 నెలల తర్వాత సీఎం కేసీఆర్‌ హాస్పిటళ్ల పర్యటనలు చేయడం సిగ్గుచేటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇలాంటి టైములో రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీలో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చారని, తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉందన్నారు. కేరళ ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు కృషి చేయడంతో పాటు ప్రైవేటు హాస్పిటళ్లలో ధరల పట్టికను పెట్టించిందని, మహారాష్ట్ర ప్రభుత్వం హాస్పిటళ్లన్నింటినీ స్వాధీనం చేసుకుని కొవిడ్‌ వైద్యం చేయిస్తోందని చెప్పారు. కరోనా నియంత్రణ విషయంలో కేసీఆర్‌ ప్రజలను మోసం చేయడంతో పాటు న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను బుట్ట దాఖలు చేశారని ఉత్తమ్‌ విమర్శించారు. లాక్‌డౌన్‌ పెట్టి అసలు ర్యాపిడ్‌ టెస్ట్‌లు కూడా చేయడం లేదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఇప్పటికైనా నిద్రలేచి తెల్లరేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలకు కరోనాకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లతో లాలూచీ పడి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని విమర్శించారు. 

Related posts