telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇండియన్ టీమ్ డ్యాన్స్ ను అమెరికా జడ్జీలు ఫిదా

V

“అమెరికాస్ గాట్ టాలెంట్” షోలో ఇండియన్ టీమ్ డ్యాన్స్‌కు అమెరికన్లు ఫిదా అయిపోయారు. క్వాటర్‌ఫైనల్స్‌లో మొత్తం 12 గ్రూపులు పాల్గొంటుండగా.. కేవలం 7 గ్రూపులు మాత్రమే సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. వీక్షకుల ఓట్లు బట్టి సెమీఫైనల్స్‌కు చేరుకునే గ్రూపును జడ్జిలు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే భారతీయ టీం పర్ఫార్మెన్స్‌కు ఊహకందని రీతిలో రెస్పాన్స్ రావడంతో భారతీయ టీం సునాయాసంగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన టీం ముందు రౌండ్లలో కూడా ఇలాంటి రెస్పాన్స్‌ను పొందాలని మనం కూడా కోరుకుందాం. క్వాటర్ ఫైనల్స్‌లో ‘వీ అన్‌బీటబుల్స్’ అనే ముంబాయ్‌కు చెందిన ఇండియన్ గ్రూప్ చేసిన డ్యాన్స్‌కు జడ్జిలు సైతం సీట్లలో నుంచి లేచి మరీ సలామ్ కొట్టారు. పైనున్న వీడియోను గమనిస్తే ఓ భారతీయ డ్యాన్స్ గ్రూప్ సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయిన ధనుష్ చిత్రం ‘మారి’ సినిమాలోని పాటకు నృత్యం చేయడం కనిపిస్తుంది. ఆ పాటలో చిన్న చిన్న పిల్లలు పది అడుగులు, ఇరవై అడుగులు గాల్లోకి ఎగిరే సీన్లు అందరినీ కట్టిపడేశాయి. అంత మందిలో ఏ ఒక్కరూ తడబడకుండా సరిగ్గా పర్ఫామ్ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం.

డ్యాన్స్ అనంతరం జడ్జి సిమాన్ కోవెల్ మాట్లాడుతూ.. ‘ప్రతిసారి మీరు ఊహకందని విధంగా పర్ఫార్మ్ చేస్తున్నారు. మీరు చేసిన ఈ డ్యాన్స్‌లో ప్రతి సెకండ్ కూడా ముఖ్యమైనదే’ అని అన్నారు. అదే విధంగా మరో జడ్జి జులియాన్ హాగ్ మాట్లాడుతూ.. ‘మీ డ్యాన్స్ చూసి నేను క్లాప్స్ కూడా కొట్టలేదు. ఎందుకంటే మీరు చేసిన డ్యాన్స్‌కు క్లాప్స్ కూడా సరిపోవు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో మీదే హైలైట్ డ్యాన్స్’ అని అభినందించారు. జడ్జి హోవీ మ్యాండెల్ మాట్లాడుతూ.. ‘నేను పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నాను. 14 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తూ వస్తున్నారు. కానీ ఇటువంటి పర్ఫార్మెన్స్ నా జీవితంలో చూడలేదు” అని గ్రూప్‌ను కొనియాడారు.

Related posts