telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య చిత్రం ఫిబ్రవరికి వాయిదా ?

balakrishna new avatar for 105th movie

నట సింహం నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం శరవేగంగా జరుగుతోంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. “జైసింహా” వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలయ్య లుక్ ఇదేనంటూ యంగ్ లుక్‌లో, ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న లుక్ వైరల్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ విషయంలో బాలయ్యకు అనుకోని అడ్డంకులు వస్తున్నాయి. ముందు నుంచి కూడా కేయస్ రవికుమార్ సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారం జరగడం లేదు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తారని ముందు నుంచి వార్తలొచ్చాయి. సంక్రాంతికి మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలు వస్తుండటంతో వెనక్కి తగ్గింది బాలయ్య చిత్ర యూనిట్.అందుకే సంక్రాంతి హడావిడి తగ్గిన తర్వాత జనవరి 26 కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.. లేదంటే ఫిబ్రవరి తొలి వారంలో రిలీజ్ చేయాలనే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

Related posts