telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మద్యం ధరలు .. భారీగా పెంపు…

new alcohol shops open in AP

నేటి నుండి మద్యం బాబులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే.. ఓవైపు భారీగా పెరిగిన ధరలు… మరోవైపు 8 గంటలకే మధ్యం షాప్ కట్టేస్తారు. ఏపీలో నూతన మధ్యం విధానం అమలు నేటి నుండే.. మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను భారీగా పెంచింది. నేటి నుంచి నూతన మధ్యం విధానంలో భాగంగా మద్యం ధరలు కూడా భారీగా అమలు కానున్నాయి. బెల్టుషాపులను నిషేధించి స్వయంగా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. ఇప్పటి నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంటాయి. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మిన…బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని జగన్ సర్కార్ హెచ్చరించింది. కాగా మద్యం దుకాణాలు ప్రభుత్వ పరిధిలోకి రావడంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం … నగరాల్లో ఉన్న మద్యం షాపుల్లో ఒక సూపర్వైజర్ ముగ్గురు సేల్స్ మెన్స్ ఉండగా… గ్రామాలు సచివాలయల్లో నిర్వహించే మద్యం షాపుల్లో ఒక సూపర్వైజర్ ఇద్దరు సేల్స్ మెన్స్ ఉంటారు.

గ్రామాల్లో 14,944 మహిళా కానిస్టేబుళ్లను నియమించి మధ్యం మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం ధరలను భారీగా పెంచిన నేపథ్యంలో కనిష్టంగా పది రూపాయల నుంచి గరిష్టంగా 250 రూపాయల వరకు టాక్స్ విధించింది ప్రభుత్వం. మద్యనిషేధం అమలు కార్యక్రమంలో భాగంగా మద్యం బాటిల్ లపై ఏఆర్ఈటి పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ విధించింది ప్రభుత్వం. 90 మిల్లీ లీటర్ల బాటిల్ కు గరిష్టంగా 10 రూపాయల పన్ను విధించగా … ఇక బాటిల్స్ సైజ్ పెరిగేకొద్ది పన్ను కూడా భారీగానే పెరుగుతుంది. దేశీయంగా తయారైన విదేశీ మద్యం బీరు తదితర వెరైటీ మద్యంపై ఈ టాక్స్ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 20 శాతం వరకు మద్యం షాపులను తగ్గించింది ప్రభుత్వం.

Related posts