telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: వాతావరణ శాఖ

rains in telugu states today

నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా అనేక ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

తెలంగాణ నుంచి ఉత్తర కేరళ వరకూ.. అలాగే రాయలసీమ నుంచి కర్ణాటక వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీనికి అనుబంధంగా కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

Related posts