telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

85 శాతం మొక్కలు బతకాలి.. సీఎం కేసీఆర్ వార్నింగ్

KCR cm telangana

తెలంగాణ సీఎం కీసీఆర్ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలపై మంగళవారం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇకపై ఒక్కో గ్రామానికి ఏడాదికి 7 వేల మొక్కలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నాటిన వాటిలో 85 శాతం మొక్కలు బతకాలి.. లేకుంటే ఉద్యోగాలు ఊడతాయని సీఎం వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల వార్షిక నివేదికలు ఇకపై తానే రాస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
100 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల‌తో పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సంవత్సరం దసరా పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఒక్కో గ్రామానికి ఇన్‌ఛార్జ్‌లుగా మండలస్థాయి అధికారులను నియమించడం జరిగింది. ప్రజాభాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మారుస్తామని కేసీఆర్ తెలిపారు. మొదటి రోజు గ్రామ సభ నిర్వహిస్తామని.. రెండో రోజు కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.

Related posts