తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గుడ్‌న్యూస్… ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది.
థియేటర్ల యజమానుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. జీవో 35ను హైకోర్టు రద్దు చేసింది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో థియేటర్లలో టికెట్స్ ను ఆన్ లైన్ లో విక్రయించాలని చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. నిర్ణయించిన ధరలకే టికెట్స్ అమ్మాలని.. బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై సంతోషం వ్యక్తం చేసినప్పటికీ టికెట్ ధరలు తగ్గింపుపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే.