telugu navyamedia
సినిమా వార్తలు

బంగార్రాజు నుంచి మ‌సాలా సాంగ్‌ పోస్టర్ విడుదల..

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కృతి శెట్టి, రమ్య కృష్ణ లేడీ లీడ్ రోల్స్ లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఇందులో యువ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.

2016లో వ‌చ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కుతోంది. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన కృతిశెట్టి సందడి చేయనుంది.

Bangarraju Movie (2022): Cast | Trailer | Songs | Release Date - News Bugz

‘మనం’లో చిత్రంలోనూ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరొకసారి ఈ చిత్రం లో నాగార్జున మరియు నాగ చైతన్య లు కలిసి నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

krithi: Krithi Shetty introduced as Naga Lakshmi in Nagarjuna, Naga  Chaitanya, Ramya Krishnan starrer Bangarraju | Telugu Movie News - Times of  India

ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్ట‌ర్స్‌ వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్ . ది పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ పేరిట ఒక పాటను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.

Nagarjuna unveils Bangarraju teaser on Naga Chaitanya's birthday -  Hindustan Times

ఇందుకు సంబంధించిన మ్యూజికల్ పోస్టర్ ను విడుదల చేస్తూ..ఓయ్‌..బంగార్రాజు..నువ్వు పెళ్ళి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు మాకింక్కెవ్వ‌డు కొనిపెడ‌తాడు కోకా.. బ్లైజూ అంటూ ఈ పాటకి సంబందించిన టీజర్ డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Watch: Akkineni Nagarjuna sings 'Laddunda,' first single from 'Bangarraju'  | Telugu Movie News - Times of India

ఈ పాటలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఆడి పాడనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను సంక్రాంతి కానుకుగా విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.

Related posts