telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వచ్చే ఎన్నికలకు చంద్ర‌బాబు దూరం..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరేమోనని పంచాయతి రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగేలా చేశాయన్నారు. కుప్పం నియోజకవర్గంగాకపోయినా… పుంగనూరులో పోటీచేసినా సాదరంగా స్వాగతిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుతున్న జగన్ పాలన పట్ల ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలు సంకేతమన్నారు.

చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే 72 ఏళ్లు నిండినందున పార్టీ పదవికి రాజీనామా చేసి హైదరాబాద్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఇన్నాళ్లూ అభివృద్ధిని పట్టించుకోని టీడీపీని కుప్పం ప్రజలు తిరస్కరించారని అన్నారు. చంద్రబాబు వచ్చేసారి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని నేను అనుకోవడం లేదని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో తనను దుర్భాషలాడారని నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Related posts