telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మేం మితిమీరి అప్పులు చేస్తుంటే ..కేంద్రం ఏం చేస్తోంది- మాజీ మంత్రి పేర్ని

రాజమండ్రిలో జ‌రిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు

వేదిక‌పై న‌డ్డా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి ఏమిచ్చారని మాట్లాడతారు? విభజన చట్టంలో ఉన్నవేమైనా నెరవేర్చారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.

దేశంలో మతం పేరుతో తన్నుకునేలా విధ్వంస రాజకీయాలు చేస్తోంది మీరు కాదా అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

నడ్డాకు రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదు అని నాని తేల్చి చెప్పారు. ఈడీ ఐటీ దాడుల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను ఇబ్బంది పెడుతోంది ఎవ‌ర‌ని పేర్నినాని చుర‌క‌లు వేశారు.

ఏపీ అప్పులపై నడ్డా చెప్పింది అంతా తప్పేనని.. 130 లక్షల కోట్లకు దేశ అప్పును తీసుకుని వెళ్లింది ఎవరంటూ ఆయన ధ్వజమెత్తారు.

నడ్డా ఏపీకి వచ్చే ముందు ఆర్ధిక మంత్రిని అడిగి వివరాలు తీసుకుని వస్తే బాగుండేదంటూ నాని సెటైర్లు వేశారు. తాము పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. మోడీకి, ఆర్ధిక మంత్రికి తెలియకుండా అప్పులు తీసుకున్నామా అంటూ పేర్ని నాని చురకలు వేశారు.

జగన్‌ అమలు చేస్తున్న అమ్మఒడిలో కేంద్రం డబ్బులున్నాయా? ఆరోగ్యశ్రీకి ఎంతిస్తున్నావు? అని ప్ర‌శ్నించారు. 

దేశ ప్ర‌జ‌ల‌పై ప్రేమ ఉంటే రాష్ర్ట ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మఒడి, స్కూళ్ళ‌ల్లో నాడు-నేడు ఆరోగ్య శ్రీ వంటి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల‌ని సూచించారు. న‌డ్డా త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Related posts