telugu navyamedia
తెలంగాణ వార్తలు

విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చా.. నా పర్యటన ఎవరికి వ్యతిరేకం కాదు. రాజకీయ కోణంలో చూడొద్దు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ యూనివర్సిటీల సందర్శిస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరిన గవర్నర్ ఈరోజు ఉదయం బాసర సరస్వతి దేవి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం ఆదివారం ఉదయం గవర్నర్ ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు.అక్క‌డ విద్యార్ధులతో సమావేశ‌మై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మెస్‌ను పరిశీలించిన గవర్నర్‌…విద్యార్థులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేశారు.

అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. సమస్యలను సత్వరం పరిష‌్కరించాలని అధికారులను ఆదేశించారు.

tamili sai soundararajan, governor, basara triple it, telangana

అనంత‌రం అక్క‌డ మీడియాతో మాట్లాడారు.. ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానన్న గవర్నర్‌.. అన్ని విషయాలు చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

బాసరా ట్రిపుల్ ఐటీతో పాటు తెలంగాణలోని మిగతా యూనివర్సిటీలను సందర్శిస్తా..  తన పర్యటన ఎవరికి వ్యతిరేకం కాదని.. ఇందులో రాజకీయం చూడాల్సిన అవసరం లేదన్నారు. యూనివర్సిటీల్లో సమస్యలపై నిత్యం విద్యార్థుల నుంచి తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

ఈరోజు నిజామాబాద్ యూనివర్సిటీని కూడా గవర్నర్ సందర్శించనున్నారు. అక్కడి సమస్యలను కూడా విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు.

Related posts