telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మహిళతో అనుచిత ప్రవర్తనకు .. 14 నెలల శిక్ష…

SIT Investigation YS viveka Murder

దేశవ్యాప్తంగా మహిళలపై, బాలికలపై, మరీ ఘోరంగా చిన్నారులపై కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోక్సో చట్టం వచ్చాక కూడా ఈ నేరాలలో తగ్గుదల రాకపోగా, పెరగటం విశేషం. దీనితో చట్టంలో మార్పులు కూడా ఇటీవల పార్లమెంట్ సమావేశాలలో చేశారు. తాజాగా, బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు 14 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌ ప్రాంతానికి చెందిన వెంటరాంరెడ్డి (43) కూలీ. 2013లో దీపావళి పండుగ రోజు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించగా.. మారేడ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

6 సంవత్సరాల అనంతరం నాంపల్లిలోని భరోసా కోర్టు న్యాయమూర్తి సునీత నిందితుడికి 14 నెలల జైలు శిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ఇక తాజాగా కోర్టు కూడా ఇటువంటి కేసులపై కీలక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం ఆయా ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న అత్యాచారాల కేసులను తక్షణమే పూర్తిచేయాలని, దానికోసం ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయాలనీ, అందుకు అవసరమైన నిధులన్నీ త్వరగా విడుదల చేయాలనీ ఆయా శాఖలను ఆదేశించింది.

Related posts